Wednesday 2 April 2014

అమ్మాయి మాటల ప్రతిధ్వని

Posted by Get Btc upon completing a small task
ఒకమ్మాయి పదే పదే మనల్ని ఒక పాట వినమంటుంది అంటే...
ఆ పాటలో గొంతు నచ్చో సంగీతం నచ్చో కాదు. తను మనకి చెప్పాలనుకున్న మాటలు, చూపించాలనుకున్న భావాలు, 
కన్న కలలు, అన్నీ ఆ పాటలో పదాలుగా వున్నాయి కాబట్టి. మనకి అవి పదాలేమో, 
తనకు మాత్రం అవి తనలోనే నిత్యం వినపడుతూ, ఎప్పటికీ బయటికి చెప్పలేని మధురమైన భావాల ప్రతిధ్వని. 

అందుకే తనలో కాకుండా ఇంకెక్కడ అవి విన్నా పసిగట్టి మనకు చిరునవ్వుతో అంకితం చేస్తుంది. 
ఇది మనకు తెలుసు, కానీ పెద్దగా పట్టించుకోము. 
కానీ ఒక్కసారి పట్టించుకొని చూస్తే అర్ధమవుతుంది తన అంకితం ఎంత అందమైనదో!
ఫణీంద్ర నర్సెట్టి
Read More
This is a Sticky post

This will appear right below the first post. You can edit this right from the template and change it to your own post. This will appear right below the first post. You can edit this right from the template and change it to your own post.This will appear right below the first post. You can edit this right from the template and change it to your own post.

ప్రేమతో...ఉగాది శుభాకాంక్షలు.

Posted by Get Btc upon completing a small task
కోపం, భయం, బాధ, అసహ్యం, ఆశ్చర్యం, ఆనందం. 
నువ్వు పిలిచినా పిలవకపోయినా దారిలో నిన్ను సదా పలకరించే తోటి బాటసారులు. నీ ప్రయాణానికి ఒక అర్ద్థం, నీ గమ్యానికి ఒక పరమార్థం, ఇవే! 
ఇదే మనం ఎంతో ఇష్టంతో తాగే ఉగాది పచ్చడి లోని సారము. షడ్రుచులు లేని పచ్చడి, ఇవేవీ లేని జీవితం చప్పగా వుంటుంది.
జీవితం మన గుప్పిట్లో వుంటుంది, చేతి రేఖల్లో కాదు. మనల్ని మనం నమ్మినప్పుడే అది అర్ధం అవుతుంది. పురోహితులు మన కోసం రాసిన pocket size పుస్తకాలని కాదు. 
పచ్చడి తాగుదాం. 
బక్షాలు తిందాం. 
పంచాంగము విందాం. అయినా...
సంకల్పాన్నే నమ్ముకుందాం. 
మీకూ, మీ కుటుంబానికీ, మీ జీవితంలో వసంతం తెచ్చిన ప్రతీ ఒక్కరికీ...ప్రేమతో...ఉగాది శుభాకాంక్షలు.
Read More

Be Unique

Posted by Get Btc upon completing a small task
అందరూ ఒకేలా వుంటే ఈ ప్రపంచం సగం కాలిన చపాతీ లా వుంటుంది. 
Leonardo DiCaprio లా మనం ఎందుకు కనపడాలి? Megan Fox పెదాల్లా మన పెదాలు ఎందుకుండాలి? ఎవరి అందం, ఎవరి ప్రత్యేకత వాళ్ళదే! 
ఒక painter గీసిన ఏ రెండు గీతలు ఒకేలా వుండవు. ప్రతీ గీతకి ఒక అందం, ఒక అర్ధం వుంటుంది. మనందరం దేవుడు గీసిన అందమైన గీతలు. ఆయన ఏదీ ఊరికే గీయడు. 
మనం మనకే వుంది అనుకుంటున్న లోపం నిజానికి లోపం కాదు. మనం ఒక unique creation అని దేవుడు మనకే ఇచ్చిన ఒక exclusive barcode.
మనకు ఇష్టమైనవాళ్ళ poster bedroom లో పెట్టుకుంటే తప్పు లేదు. కానీ మనమూ అలాగే కనపడాలని, మాట్లాడాలని, మనం వాళ్ళమే అని చూసే వాళ్ళు అనుకోవాలని మనం ప్రవర్తిస్తున్న ప్రతీ క్షణం మన ఆత్మని anaesthesia కూడా లేకుండా ముక్కలు ముక్కలు గా కోస్తున్నాం.
పండుని చూసి పువ్వు ఎప్పుడూ బాధపడదు. ఎందుకంటే పండు రుచి ఇస్తే పువ్వు పరిమళం ఇస్తుంది.
అలాగే పువ్వుని చూసి ఆకు ఏ రోజూ బాధపడదు. ఎందుకంటే పువ్వునుండి వచ్చిన ఆ పరిమళాన్ని గాలిలోకి వీసేది ఆ ఆకే.
దేని ప్రయోజనం దానికి వుంటుంది.
అద్దంలో చూసుకున్నప్పుడు నీకు నువ్వే కదా కనపడేది? మీ gang లో బాగా డబ్బున్న అబ్బాయో, మీ ఎదురింటి అందమైన అమ్మాయో కాదు కదా? మరి? ఎవరికో నచ్చాలనీ, ఎవరినో ఒప్పించాలనీ బ్రతకడం ఏంటి?
గడ్డం అంటే ఇష్టమా? పెంచుకో.
చిరిగిన, మాసిపోయిన jeans నే వేసుకోవాలనుందా? వేసుకో.
చెవికి పోగు పెట్టుకోవాలనుందా? పెట్టుకో.
వీడు చూస్తాడు, వాడు ఏడుస్తాడు అని ఆలోచించకు.
"అర్రె...మనం వాడిలా వుండలేకపోతున్నామే" అని అనుకునే వాళ్ళే మనల్ని పిచ్చోడు అంటారు.
"అబ్బో...వీడు మన కంటే పై స్థాయిలో వున్నాడే!" అని అనుకునే వాళ్ళే మనల్ని కిందకి లాగాలని చూస్తారు.
నీ తలనే దువ్వుకుంటూ ఇంకొకరిలా వుండాలి అని అనుకోవడమేంటి? నీ రూపాన్ని నీకు నిజంగా చూపించే అద్దంతో ఎప్పుడూ అబద్ధం చెప్పకు. దాని కంటే దరిద్రం ఇంకొకటి వుండదు.
Modern art of Living అంటే
జేబులో smartphone ,
చెవిలోearphones ,
నోట్లో Chewing gum కాదు.
ఇంకొకరికి భయపడకుండా, ఇంకొకరిని నొప్పించకుండా మనం మనలా బ్రతకడం.
మనం చచ్చిన తరువాత ఆ frame లో మన photo నే కదండీ వుండేది? వాళ్ళదీ, వీళ్ళదీ కాదు కదా? పూలదండ అయినా, అగర్బత్తీ అయినా మనకే కదా? మరెందుకండీ...బ్రతికినప్పుడు వాళ్ళ లా, చచ్చినప్పుడు మనలా? ఈ Xerox బ్రతుకు మనకు అవసరమా?
మన రూపాన్ని ఎప్పుడూ ఎందుకిలా వుంది అని అనుకోవడం ఇప్పటికైనా ఆపాలి. మనం తప్పులు చేస్తామేమో కానీ దేవుడు చేయడు.
Phanindra Narsetti
Read More

Saturday 14 December 2013

My First words about you .....

Posted by Get Btc upon completing a small task
The Words that listen from your words !!!
     " inhalingwith deep breath and closing my eyes looking in the dark and watching on to the top"
my mehsoos kar saktha Hoon
I can listen your words and i can feel them with all te sweetness that i ever wanna experience these days!!

When ever I wanna look at you either you will be looking at me...
or I feel that you could look at me either...


Tu hain mujhukho batha de...
 Chahoon mein aana..............


Kyon ki tum hi Hoon
 Ab tum hi hoon Gindagi ab tum hi hoon

Read More