Wednesday 2 April 2014

Be Unique

Posted by Get Btc upon completing a small task
అందరూ ఒకేలా వుంటే ఈ ప్రపంచం సగం కాలిన చపాతీ లా వుంటుంది. 
Leonardo DiCaprio లా మనం ఎందుకు కనపడాలి? Megan Fox పెదాల్లా మన పెదాలు ఎందుకుండాలి? ఎవరి అందం, ఎవరి ప్రత్యేకత వాళ్ళదే! 
ఒక painter గీసిన ఏ రెండు గీతలు ఒకేలా వుండవు. ప్రతీ గీతకి ఒక అందం, ఒక అర్ధం వుంటుంది. మనందరం దేవుడు గీసిన అందమైన గీతలు. ఆయన ఏదీ ఊరికే గీయడు. 
మనం మనకే వుంది అనుకుంటున్న లోపం నిజానికి లోపం కాదు. మనం ఒక unique creation అని దేవుడు మనకే ఇచ్చిన ఒక exclusive barcode.
మనకు ఇష్టమైనవాళ్ళ poster bedroom లో పెట్టుకుంటే తప్పు లేదు. కానీ మనమూ అలాగే కనపడాలని, మాట్లాడాలని, మనం వాళ్ళమే అని చూసే వాళ్ళు అనుకోవాలని మనం ప్రవర్తిస్తున్న ప్రతీ క్షణం మన ఆత్మని anaesthesia కూడా లేకుండా ముక్కలు ముక్కలు గా కోస్తున్నాం.
పండుని చూసి పువ్వు ఎప్పుడూ బాధపడదు. ఎందుకంటే పండు రుచి ఇస్తే పువ్వు పరిమళం ఇస్తుంది.
అలాగే పువ్వుని చూసి ఆకు ఏ రోజూ బాధపడదు. ఎందుకంటే పువ్వునుండి వచ్చిన ఆ పరిమళాన్ని గాలిలోకి వీసేది ఆ ఆకే.
దేని ప్రయోజనం దానికి వుంటుంది.
అద్దంలో చూసుకున్నప్పుడు నీకు నువ్వే కదా కనపడేది? మీ gang లో బాగా డబ్బున్న అబ్బాయో, మీ ఎదురింటి అందమైన అమ్మాయో కాదు కదా? మరి? ఎవరికో నచ్చాలనీ, ఎవరినో ఒప్పించాలనీ బ్రతకడం ఏంటి?
గడ్డం అంటే ఇష్టమా? పెంచుకో.
చిరిగిన, మాసిపోయిన jeans నే వేసుకోవాలనుందా? వేసుకో.
చెవికి పోగు పెట్టుకోవాలనుందా? పెట్టుకో.
వీడు చూస్తాడు, వాడు ఏడుస్తాడు అని ఆలోచించకు.
"అర్రె...మనం వాడిలా వుండలేకపోతున్నామే" అని అనుకునే వాళ్ళే మనల్ని పిచ్చోడు అంటారు.
"అబ్బో...వీడు మన కంటే పై స్థాయిలో వున్నాడే!" అని అనుకునే వాళ్ళే మనల్ని కిందకి లాగాలని చూస్తారు.
నీ తలనే దువ్వుకుంటూ ఇంకొకరిలా వుండాలి అని అనుకోవడమేంటి? నీ రూపాన్ని నీకు నిజంగా చూపించే అద్దంతో ఎప్పుడూ అబద్ధం చెప్పకు. దాని కంటే దరిద్రం ఇంకొకటి వుండదు.
Modern art of Living అంటే
జేబులో smartphone ,
చెవిలోearphones ,
నోట్లో Chewing gum కాదు.
ఇంకొకరికి భయపడకుండా, ఇంకొకరిని నొప్పించకుండా మనం మనలా బ్రతకడం.
మనం చచ్చిన తరువాత ఆ frame లో మన photo నే కదండీ వుండేది? వాళ్ళదీ, వీళ్ళదీ కాదు కదా? పూలదండ అయినా, అగర్బత్తీ అయినా మనకే కదా? మరెందుకండీ...బ్రతికినప్పుడు వాళ్ళ లా, చచ్చినప్పుడు మనలా? ఈ Xerox బ్రతుకు మనకు అవసరమా?
మన రూపాన్ని ఎప్పుడూ ఎందుకిలా వుంది అని అనుకోవడం ఇప్పటికైనా ఆపాలి. మనం తప్పులు చేస్తామేమో కానీ దేవుడు చేయడు.
Phanindra Narsetti

0 comments:

Post a Comment